డైరెక్టర్ పై రేప్ కేసు పెట్టిన టీవీ నటి

Casting couch
Casting couch

Casting couch | బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కలకలం మొదలై చాలా కలం అయింది. అలాగే అప్పట్లోనే సద్దుమణిగి పోయింది కూడా. ఎవరు పడితే వారు ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూ ని పబ్లిసిటీ కోసం వాడేసుకోవటంతో అందరు దీన్ని లైట్ గా తీసేసుకున్నారు. తాజాగా మరో టీవీ నటి ఒక కాస్టింగ్ డైరెక్టర్ పై రేప్ చేశాడంటూ ముంబై పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే….

ఒక వర్ధమాన టీవీ నటి. కాస్టింగ్ డైరెక్టర్ ఆయుష్ తివారి పై ముంబై వెర్సోవా పోలీస్ స్టేషన్ లో కేస్ పెట్టింది. రెండేళ్ల నుంచి పెళ్లి చేసుకుంటానని మోసం చేసాడని, అప్పటి నుంచి చాలా సార్లు రేప్ చేసాడని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే మోసం చేసాడని చెపుతోంది. పోలీసులు సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు చాలా వరకు ఫేక్ అవటం కారణంగా నెమో, ముంబై పోలీసులు అతనిని అరెస్ట్ చేయకుండానే దర్యాప్తు చేస్తున్నారు.