ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, ఇప్పుడు బాలయ్య

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna | టాలీవుడ్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేసిన హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు ముందు వరసలో ఉంటారు. ఒకానొక టైం లో ఆయన రోజుకి మూడు షిఫ్టులు పనిచేస్తూ తీవ్రంగా శ్రమించారు. నిజానికి సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరువాత ఆయనకు అంత అవసరం లేదు. అయినా సినీ కార్మికులకు పని కల్పించటంకోసం వచ్చిన ప్రతి సినిమా కాదనకుండా చేసుకుంటూ పోయారు అప్పట్లో కృష్ణ గారు. ఇప్పటికీ ఆయనను సినీ కార్మికులు విపరీతంగా అభిమానించటానికి అదే కారణం.

ఇప్పుడున్న హీరోలో సినీ పరిశ్రమ జనాలకు అంతోఇంతో సాయం చేస్తున్న బాలయ్య ను కూడా సినీ కార్మికులు బాగానే అభిమానిస్తారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూ, కాన్సర్ హాస్పిటల్ పనుల్లో బిజీగా ఉన్న బాలయ్య ఈవయసులోనూ వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న కారణాల్లో కార్మికులకు పని కల్పించటం కూడా ఒకటి. అలాగే కరోనా కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను పబ్లిసిటీ లేకుండా ఆదుకున్న ఒకేఒక్క హీరో బాలయ్య. అందుకే కానివారు నందమూరి బాలకృష్ణ అంటారు. అయిన వాళ్ళు బాలయ్య అంటారు. సినిమా జనాలు బాలయ్య బాబు అంటారు.