రౌడీ బాయ్స్ 2 వారాల కలెక్షన్

Rowdy boys collections
Rowdy boys collections

Rowdy boys collections | మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ తోనే బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆమె మొదటి చిత్రం ప్రేమమ్ సంచలన విజయం సాధించింది.ఇదే సినిమాతో సాయి పల్లవి కూడా ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకుంది. తెలుగులో అనుపమ మొదటి చిత్రం నితిన్ హీరోగా తెరకెక్కిన అ ఆ. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ సమంత. సెకండ్ హీరోయిన్ గా ఆమెకు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు త్రివిక్రమ్. మొదటి చిత్రంతోనే అమ్మడి అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తరువాత వరుస ఆఫర్లతో బిజీ అయిన అనుపమ, ప్రస్తుతం అంత బిజీగా లేదు. అందుకేనేమో కొత్త హీరోతో లిప్ లాకులు, బోల్డ్ సీన్స్ లో నటించింది అనుపమ.

రౌడీ బాయ్స్ సినిమా లో అనుపమ రెచ్చిపోయి నటించి ట్రెండ్ మార్చుకుంది. ఈ సినిమా సడెన్ గా సంక్రాంతి బరిలో నిలిచింది. అంతే కాదు అదేరోజు విడుదలైన నాగార్జున ‘బంగార్రాజు’ కన్నా నైజాం లో ఎక్కువ థియేటర్స్ లో విడుదలైంది రౌడీ బాయ్స్. కారణం హీరో దిల్ రాజు సోదరుని కొడుకు కావటం. బహుశా అందుకేనేమో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇన్నిరోజులు రెస్ట్రిక్షన్స్ పెట్టుకుని నిర్మాత కొడుకు తో రెచ్చిపోవటం పై ముఖ్యంగా అనుపమ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అనుపమ ఎంతగా అందాలు ఆరబోసినా ఈ సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.  కలెక్షన్ పై ఓ లుక్కేద్దాం.

Rowdy boys pre-release business

నైజాం : 4.5Cr(Valued)
సీడెడ్ : 1.80Cr
ఆంధ్ర : 4Cr(Valued)
రెస్ట్ : 0.౭౦క్ర
టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ : 11CR
అంటే 11.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ వేట మొదలు పెట్టింది రౌడీ బాయ్స్.

Rowdy boys collections – 2 weeks

నైజాం : 1.68Cr
సీడెడ్ : 81L
ఉత్తరాంధ్ర : 1.16Cr
ఈస్ట్ : 28L
వెస్ట్ : 20L
గుంటూరు : 23L
కృష్ణ : 23L
నెల్లూరు : 15L
AP-TG Total:- 4.74CR(8.90CR Gross)
రెస్ట్ అఫ్ ఇండియా : 0.10Cr
ఓవర్సీస్ – 0.12Cr
Total WW: 4.96CR(9.25CR Gross)

11.50 కోట్ల టార్గెట్ తో మొదలైన ఈ సినిమా ఇంకా 5 కోట్లలోనే ఉంది. అంటే ఇంకా దాదాపుగా 7 లోట్ల షేర్ కాలేచ్ట్ చేయాల్సి ఉంది. ఒక డిజాస్టర్ సినిమా  ఆ అమౌంట్ కలెక్ట్ చేయటం అసాధ్యమే. అంటే బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా బొక్కబోర్లా పడినట్టే.