బలవంతంగా లిప్ లాక్ పెట్టించారట

sameera reddy
sameera reddy

Sameera Reddy | ఎన్టీఆర్ నరసింహుడు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి అదే ఎన్టీఆర్ అశోక్ సినిమా తరువాత టాలీవుడ్ కి దూరమైంది సమీరా రెడ్డి. మెగాస్టార్ చిరంజీవితోనూ జై చిరంజీవ సినిమాలో నటించింది. సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య తరువాత వెల్లువెత్తిన నేపాటిజం ఆరోపణలపై స్పందించింది సమీరా రెడ్డి. స్టార్ కిడ్స్ కోసం సైన్ చేసిన తరువాత కూడా మూడు సినిమాల్లో నుంచి తప్పించారట.

ఒక సినిమాలో స్క్రిప్ట్ లో లేని ముద్దు సీన్ లో నటించామన్నారని బలవంతం చేశారట. లేకపోతె ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని ఫోర్స్ చేశారట. ఒక హీరో అయితే నువ్వు కమిట్మెంట్ ఇవ్వటంలేదు, నా నెక్స్ట్ సినిమాల్లో నువ్వు వుండవు అని బెదిరించాడట. ఇంతకీ ఆహీరోలు దర్శక నిర్మాతల పేర్లు మాత్రం సమీరా రెడ్డి బయట పెట్టలేదు.