15 మిలియన్లు దాటేసిన మహేష్ బాబు ఫాలోయింగ్

Super star Mahesh babu
Super star Mahesh babu

Super star Mahesh babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ ముగించి వచ్చేనెలలో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవనున్నాడు మహేష్ బాబు. సోషల్ మీడియా లో మహేష్ బాబు తోసహా మొత్తం ఫ్యామిలీ అంతా బాగా యాక్టీవ్ గా ఉంటారు. మహేష్ బాబు కు బయట ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. అలాగే సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్.

ట్విట్టర్ లో మహేష్ ను 11.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో మహేష్ కు ఇప్పటికే 7.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మహేష్ బాబు పేస్ బుక్ పేజీ కి ఫాలోయర్స్ 15 మిళియన్లను దాటిపోయారు. అన్ని ప్లాట్ ఫార్మ్స్ లోనూ మహేష్ ను మిలియన్ల మంది ఫాలో అవుతుండటం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఉత్తరాది వారు కూడా మహేష్ ని బాగానే ఫాలో అవుతున్నారు.