త్రిష పెళ్లి … ఈసారి ఖాయమేనట

Trisha krishnan
Trisha krishnan

Trisha krishnan | హిందీతోసహా సౌత్ భాషలన్నిటిలో నటించిన త్రిష సుదీర్ఘ కాలంగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. స్టార్ హీరోలందరితోనూ నటించిన త్రిష హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి కెరీర్ కొనసాగిస్తున్న త్రిష కొన్నేళ్ల నుంచి తన హవా కోల్పోయింది అని చెప్పక తప్పదు. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్న త్రిష డౌన్ అయిన ప్రతిసారి పెళ్లి ప్రస్తావన రావటం, అది ర్యూమర్ అని తేలటం మాములు విషయం అయిపొయింది.

కొన్నేళ్ల క్రితం వరుణ్ మణియన్ అనే నిర్మాతతో ఎంగేజ్మెంట్ అయిన తరువాత పెళ్లి రద్దు చేసుకుంది త్రిష. ఆ తరువాత కూడా చాల సార్లు త్రిష పెళ్లి వార్తలు వచ్చాయి. అయితే పెళ్ళిమాత్రం జరగలేదు. తాజాగా మరోసారి కోలీవుడ్ సర్కిల్స్ లో త్రిష పెళ్లి హాట్ టాపిక్ అయింది. ఓ బిజినెస్ మ్యాన్ తో త్రిష పెళ్లి ఫిక్స్ అయిందని, చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి సినిమాలకు గుడ్ బై చెప్పనుంది చెన్నైలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందొ తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.