ఆస్కార్ ఆశలు మరోసారి గల్లంతయ్యాయి

image 4
image 4

ఈసారి ఆస్కార్‌ అవార్డుపై ఆశ‌లు చిగురింప జేసిన భారతీయ సినిమా `జై భీమ్‌`. దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు పొంది, ప‌లు అంత‌ర్జాతీయ చిత్రోత్స‌వాల్లో ప్రదర్శించబడిన `జై భీమ్` ఆస్కార్ కి కూడా వెళ్లింది. ఉత్త‌మ విదేశీ చిత్రం కేట‌గిరీలో ఆస్కార్ కోసం పోటీ ప‌డింది. ఈసారి `జై భీమ్`కి ఆస్కార్ అవార్డు రావ‌డం ఖాయం అని విశ్లేష‌కులు జోస్యం చెప్పారు. `జై భీమ్` చిత్ర‌బృందం కూడా సినిమాని ఆస్కార్ బ‌రిలో చివ‌రి వ‌ర‌కూ తీసుకురావాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆస్కార్ క‌మిటీ ప్ర‌క‌టించిన నామినేషన్స్ తుది జాబితాలో సూర్య జై భీమ్ కి చోటు ద‌క్క‌లేదు. దాంతో ఆ చిత్ర టీమ్ తో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులూ నిరాశకు గురయ్యారు..