ఉచిత హామీల్లో దక్షిణాది పార్టీలని మించిపోతున్న యుపి బిజెపి

yogi 1 1
yogi 1 1

ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఉచిత హమీల వర్షం కురిపించింది. ఈ ఎన్నికల్లో బిజెపి మేనిఫెస్టోను ‘లోక్‌ కల్యాణ్ సంకల్ప పత్రం’ పేరుతో విడుదల చేసారు. ఇందులో ప్రతీ పేజీ లోనూ ఓటర్లకు తాయిలాలే ఉన్నాయి. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై రగిలిపోతున్న రైతులకు, నిరుద్యోగులకు బోల్డన్ని తాయిలాలు ప్రకటించారు. మళ్ళీ అధికారంలకి వస్తే ఐదేళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఓ భారీ హామీ ఇచ్చేసారు.

విద్యుత్ సంస్కరణల్లో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఉచిత విద్యుత్ తొలగించాలని కేంద్రంలో బీజేపీ పట్టుబడుతోంది. అదే బీజేపీ ఎన్నికలున్న ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చేసింది. పీఎం కిసాన్ సాయం కూడా రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చేసారు యోగి. ఉద్యోగం చేసే మహిళలకు ఉచిత స్కూటీలు, విద్యార్థినులకు పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ , విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఇంటికో ఉద్యోగం హామీలు ఇచ్చేసింది యుపి బిజెపి.