ఏపీ సీఎం తో సినీ ప్రముఖుల? భేటీ ఖరారు

image 1 1
image 1 1

ఆంధ్ర ప్రదేశ్ సీఎం తో సినీ ప్రముఖుల భేటీ ఖరారైంది. చిరంజీవి, నాగార్జున లతోపాటు ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్‌ నిర్మాతలు కూడా ఈ నెల 10న ఏపీ సీఎంతో సమావేశం కానున్నారు. వీరితో పాటు మరికొంత మంది సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా సీఎం తో భేటీలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఏపీ సీఎం తో ఏపీ మంత్రి పేర్నినాని భేటీ అయ్యారు. సినిమా టికెట్ల అంశంతో పాటు, ఇండస్ట్రీ సమస్యలు, కమిటీ రిపోర్టుపై సీఎం తో మంత్రి చర్చించారు. ఈరోజు మరోసారి సీఎం తో మంత్రి భేటీ కానున్నారు. రేపు ఇండస్ట్రీ ప్రముఖుల భేటీలో రానున్న అంశాలపై సీఎం తో చర్చించనున్నారు.