తెలుగు రాష్ట్రాల విభజన సహేతుకంగా జరగలేదన్న ప్రధాని

నరేంద్ర మోడీ
నరేంద్ర మోడీ

భారత దేశం ఎదుర్కున్న అన్ని కష్టాలకు కాంగ్రెస్సే కారణమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అర్బన్ నక్సలైట్లకు, కాంగ్రెస్‌ పార్టీకి తేడా లేదన్న మోడీ, కాంగ్రెస్ లేకపోతే అసలు భారత దేశంలో ఎమర్జెన్సీ వచ్చేదే కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే మన దేశంలో అవినీతి బాగా పెరిగిందని ప్రధాని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల విభజనపై కూడా కాంగ్రెస్ ను విమర్శిస్తూ హాట్ కామెంట్స్ చేశారు మోడీ. అధికార దాహంతో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు.

సొంత కాంగ్రెస్ తెలుగు నేతల్ని కూడా వాళ్లు పట్టించుకోలేదని, సభలో మైకులు కట్ చేసి, తలుపులు మూసేసి ఏపీని విభజించారని మోడీ అసహనం వ్యక్తం చేశారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో మూడు రాష్ట్రాల విభజన. శాంతియుత వాతావరణంలో జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటును తాము వ్యతిరేకించడం లేదని, కానీ ఏర్పాటు చేసిన విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని మోడీ పేర్కొన్నారు.