కర్ణాటక తోపాటు దేశాన్ని కుదిపేస్తున్న హిజాబ్‌

karnataka hijab controversy
karnataka hijab controversy

karnataka hijab controversy | హిజాబ్‌ వివాదం మానపక్క రాష్ట్రం కర్ణాటకను కుదిపేస్తోంది. పలు స్కూళ్ళు, కాలేజీల వద్ద హిజాబ్‌ కు అనుకూల, వ్యతిరేక వర్గాల రచ్చ తారాస్థాయికి చేరింది. నినాదాలు, ఆందోళనలతో విద్యా సంస్థల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాగల్‌కోటలోని ఓ ప్రముఖ కళాశాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. దానికి ప్రతిగా విద్యార్థులు రాళ్లతో ఎదురుదాడికి దిగారు.

మరోవైపు హిజాబ్‌ వివాదం కర్ణాటక హైకోర్టుకు చేరింది. ప్రభుత్వం, పిటిషనర్ల తరఫున వాదలను విన్న హైకోర్టు, విచారణను ఈరోజుకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మూడురోజుల పాటు స్కూల్స్, కాలేజీలు మూసివేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదేశించారు.