పక్కా ప్లానింగ్ తోనే విజయ్ పొలిటికల్ ఎంట్రీ

star hero vijay in tamil politics
star hero vijay in tamil politics

star hero vijay in tamil politics | రాజనీకాంత్ తరవాత కోలీవుడ్ లో ఆస్థాయి క్రేజ్ ఉన్న నటుడు విజయ్. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించటానికి విజయ్ సన్నాహాలు మొదలుపెట్టారు. వియజ్ పొలిటికల్ ఎంట్రీకి సరైన సమయం ఇదే అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం తమిళ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అన్నాడీఎంకే పార్టీ పూర్తిగా నిర్వీర్యమైందని టాక్.

ప్రస్తుతం బలమైన ప్రతిపక్షం తమిళనాడులో కనిపించటం లేదు. దీంతో స్టార్ హీరో విజయ్ పక్కా ప్లానింగ్ తోనే ఇప్పుడు పోలికలు ఎంట్రీ ఇస్తున్నాడని మేధావులు అంచనా వేస్తున్నారు. గతంలో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాను వస్తాను అంటూ తూచ్ అన్నాడు. మరో స్టార్ హీరో కమల హాసన్ గత ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిల్టు లేకుండా పోయాడు. మరి విజయ్ రాజకీయాల్లో రాణిస్తాడో లేదో చూడాలి.