ప్రియుడితో పెళ్ళికి సిద్దమైన కియారా అద్వాని ?

Kiara Advani Siddharth malhotra
Kiara Advani Siddharth malhotra

Kiara Advani Siddharth malhotra | చాలాకాలంగా సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వాని మధ్య ఎదో ఉందని ముంబై మీడియా కోడై కూస్తుంది. వాళ్ళు అలాంటిదేమి లేదని ఖండిస్తున్నా, సినిమా జనాలందరూ వారిద్దరిని జంటగానే భావిస్తున్నారు. అసలు వాళ్లిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా షెర్జా కు ముందు చేయలేదు. అలాంటిది మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటే నమ్మే లా ఉందా? కరణ్ జోహార్ ఇంటి వద్ద ఓ పార్టీ లో ఇద్దరూ కలిసారని, అప్పటినుంచి డేటింగ్ చేస్తున్నారని గుసగుసలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. … వీరిద్దరూ కలిసి మొదటిసారి నటించిన షేర్షా సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

బాలీవుడ్‌ లో ఇప్పటికే పెళికి సిద్ధంగా ఉన్నారు రణ్ భీర్ కపూర్, ఆలియా భట్. మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తన్న ఈజంట ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ మధ్య కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ కూడా ఓపెన్ సీక్రేట్ గా ప్రేమించుకుని తరువాత పెళ్ళి బంధంతో ఒకటయ్యారు. ఇక మరో బాలీవుడ్ జంట కియారా అద్వానీ-సిద్దార్థ్‌ మల్హోత్రాలు కూడా త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.