అమెరికా లో ప్రభాస్ స్టామినా చూపించిన రాధేశ్యామ్

Radhe Shyam gets a huge release in USA
Radhe Shyam gets a huge release in USA

Radhe Shyam gets a huge release in USA | రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ప్రభాస్ రేంజ్ ని అమాంతం పెంచేసింది. బాహుబలి ముందు ప్రభాస్ కి బాహుబలి తరువాత ప్రభాస్ కి చాలా తేడా ఉంది. ఇప్పుడు ప్రభాస్ కావాలని అనుకున్నా, చిన్న సినిమా చేసే పరిస్థితిలో లేడు. బాహుబలి ఇమేజ్ కూడా అంత తొందరగా పోయేది కాదు. బాహుబలి తరువాత విడుదలైన సాహో భారీ డిజాస్టర్ అయినా ప్రభాస్ ఇమేజ్ చెక్కు చెదరలేదు. పైగా ఇంకా బాలీవుడ్ మార్కెట్ పెరుగుతూనే ఉంది. ప్రభాస్ తాజా చిత్రం రాధే శ్యామ్ వివిధ కారణాల వలన చాలా లేట్ అయింది. ఈ ప్రాసెస్ లో ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం యువి క్రియేషన్స్ ను ఎన్నో సార్లు ట్రోల్ చేసారు. అప్డేట్ రాగానే ఆ ట్రోల్ల్స్ మర్చిపోయి ప్రభాస్ ని ట్రెండింగ్ లో ఉంచారు అభిమానులు.

ఎట్టకేలకు రాధే శ్యామ్ మార్చ్ 11 న విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10000 థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఒక్క అమెరికాలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది రాధే శ్యామ్. 1116 లొకేషన్స్ లో 3116 స్క్రీన్ లలో విడుదలవుతుంది ప్రభాస్ రాధే శ్యామ్. మార్చ్ 10 న ఒక్కరోజే 11116 షోస్ తో రికార్డు సృష్టించనుంది ప్రభాస్ రాధే శ్యామ్. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారిగా పూజాహెగ్డే తో రొమాన్స్ చేయనున్నాడు.