ఆపాటపై కీర్తి సురేష్ ను ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్

Super star Mahesh babu fans troll Keerthy suesh for her cheap video
Super star Mahesh babu fans troll Keerthy suesh for her cheap video

Super star Mahesh babu fans troll Keerthy suesh for her cheap video | మహానటితో టాలీవుడ్ తోపాటు దేశం దృష్టిని ఆకర్షించిన కీర్తి సురేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ల్స్ కి గురవుతుంది. మహానటితో కీర్తి సురేష్ కి వచ్చిన ఇమేజ్ ని వాడుకుని సొమ్ము చేసుకోవటానికి చాలామంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. కీర్తి సురేష్ ను సెంటర్ చేసి లేడీ ఓరియెంటెడ్ రోల్స్ తో సినిమాలు చుట్టేసి బిజినెస్ చేసుకున్నారు. కీర్తి సురేష్ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. తన ఇమేజ్ మీద ఆమెకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి.. కట్ చేస్తే ….

ఇప్పుడు ఆ డిజాస్టర్ల పుణ్యమా అని, కీర్తి సురేష్ ఇమేజ్ బాగా దెబ్బ తినేసింది . ఒకరకంగా ఇప్పుడు కీర్తి కి మహేష్ బాబు సర్కారు వారి పాట మరో లైఫ్ ఇవ్వాల్సిందే. అయితే మొదటినుంచి మహేష్ ఫ్యాన్స్ కు కీర్తి సురేష్ నచ్చటం లేదు. అసలామె మహేష్ స్థాయి హీరోయిన్ కాదనేది వారి అభిప్రాయం. సూపర్ స్టార్ తో సినిమా చేతిలో పెట్టుకుని ఆమె చేసే లో క్లాస్ సినిమాలు వారిని విపరీతంగా విసిగిస్తున్నాయి. తాజాగా అమ్మడు గాంధారి అనే మ్యూజిక్ వీడియోతో ఎదో సాధిద్దామని ఊహించుకుంది. అంత చీప్ సాంగ్ చేసినందుకు మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు మరోసారి కీర్తి సురేష్ ను ట్రోల్ చేస్తున్నారు.