Naga chaitanya OTT project for Amazon prime | కెరీర్ మొదట్లో కొన్ని సాలిడ్ హిట్లున్న నాగ చైతన్య స్క్రిప్ట్ సెలక్షన్ లో లోపాల వల్ల వరుస ప్లాపులను ఎదుర్కున్నాడు. వెంకటేష్ తో కలిసి నటించిన వెంకీ మామ తో మళ్ళీ గాడిలో పడ్డ చైతు అక్కడినుంచి వరుసగా నాలుగు సినిమాలు 50 కోట్ల క్లబ్ లో నిలిపాడు. ఇప్పుడు వచ్చిన ఈ ఫామ్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ సెలక్షన్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట నాగ చైతన్య. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమాలో చైతు నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హారర్ వెబ్ సిరీస్ లో నెగటివ్ రోల్ పోషించనున్నారు నాగ చైతన్య.
అమెజాన్ ప్రైమ్ లో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ తో ఓటిటి ఎంట్రీ ఇస్తున్నాడు చైతు. నిన్న శివరాత్రి సందర్భంగా ఈ విషయాన్నీ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసాడు నాగ చైతన్య.
View this post on Instagram