Nithya Menen Bheemla nayak | టాలీవుడ్ లో అడుగుపెడుతున్న మల్లు బ్యూటీలు చాలామందే ఉన్నారు. వారిలో నిత్య మీనన్ కు ప్రత్యేక స్థానం ఉంది. నిత్య లేటెస్ట్ సినిమా భీమ్లానాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన భీమ్లానాయక్ లో పవన్ వైఫ్ పాత్రలో నటించింది నిత్య మీనన్. ఈ సినిమా గతవారం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టించింది. అయితే ఈ సినిమా విషయంలో నిత్య మీనన్ హ్యాపీ గా లేదని, ఓ సంఘటన ఆమెను బాగా హర్ట్ చేసిందని టాక్ వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే…
రామజోగయ్య శాస్త్రి రాసిన మెలోడీ సాంగ్ `అంత ఇష్టం ఏందయ్యా` విడుదలకు ముందు హిట్టయింది. పవన్, నిత్య మీనన్ లపై చిత్రీకరించిన ఈ మెలోడీ సినిమాకు హైలైట్ అవుతుందనుకున్నారు. కట్ చేస్తే… సినిమాలో ఈ పాట కనపడలేదు. ఎడిటింగ్ లో మేకర్స్ తీసేయటంతో నిత్య మీనన్ హర్ట్ అయిందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా తమన్ ఈ విషయంపై స్పందించాడు. బాగా వేడి మీద సినిమా ఉన్నప్పుడు ఈ కాల్ సాంగ్ బాగుండదని తొలగించామని క్లారిటీ ఇచ్చాడు తమన్.