Tabu reacts to the dating rumors | టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లపై డేటింగ్ ర్యూమర్స్ రావటం సహజం. కొన్ని వెంటనే బ్రేక్ అవుతాయి కానీ మరికొన్ని ర్యూమర్లు ఏళ్ళ తరబడి వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వయసు దాటిపోయినా పెళ్లి చేసుకొని హీరోయిన్లపై ర్యూమర్లకు కొదువే లేదు. 51 ఏళ్ళ టబు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గానే తెరంగేట్రం చేసిన టబు కు పలానా హీరోతో ఎఫైర్ ఉందనే ర్యూమర్లు చాలాసార్లు వినిపించాయి. ముఖ్యంగా ఓ బాలీవుడ్ సీనియర్ హీరో పేరు, ఓ టాలీవుడ్ సీనియర్ హీరో పేరు టబు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా నాగార్జున తో టబు కు ఎఫైర్ ఉందనేది చాలా పాత ర్యూమర్.
తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో టబు కు నాగార్జున తో ఎఫైర్ ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానం చెప్పిన టబు, నాగార్జునతో ఉన్నది స్పెషల్ రిలేషన్ అని, దానికి పేరు లేదని, అది ఫ్రెండ్ షిప్ మాత్రమే అని చెప్పింది. అంతే కాదు మీడియా కు తన బాయ్ ఫ్రెండ్ పై ఎక్కువ ఆసక్తి అని, బాయ్ ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు కానీ నాగార్జున మాత్రం మీడియా ర్యూమర్లలో అలాగే ఉంటాడని, దానికి తానేమి చేయలేనని చెబుతుంది టబు.