Rajamouli trolled badly | కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త, సుష్మ స్వరాజ్ దత్త పుత్రుడు అయిన గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దక్షిణ భారతదేశంలోనే గాలి జనార్దన్ రెడ్డి లాంటి అవినీతిపరుడు లేడంటారు. ఇప్పటికీ అవినీతి కేసులు ఎదుర్కుంటూ, బెయిల్ పైన బయట ఉన్నాడు ఈ మైనింగ్ మాఫియా కింగ్. సాక్షాత్తు జడ్జ్ కే లంచం ఇచ్చాడనే ఆరోపణలు సైతం ఉన్న గాలి జనార్దన్ రెడ్డి పక్కన దర్శక ధీరుడు రాజమౌళి కనిపించటం అధికశాతం తెలుగు ప్రేక్షకులకు నచ్చటం లేదు. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభ వేడుక శుక్రవారం జరిగింది. ఈ వేడుకగు ముఖ్య అతిథిగా వెళ్ళాడు రాజమౌళి. అప్పటి నుంచి రాజమౌళిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అందుకు కారణం లేకపోలేదు ….
ఒకప్పుడు అవినీతి ఎక్కువైపోయిందని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం కోసం లోక్ సత్తాకు మద్దతివ్వటమే కాక ప్రచారం కూడా చేసిన రాజమౌళి గతాన్ని మర్చిపోయాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. రాజమౌళి సినిమా ఓపెనింగులకి వెళ్ళటం కొత్తేమి కాదు అయితే గాలి జనార్దన్ రెడ్డి లాంటి అవినీతి పరుడిని అవాయిడ్ చేసి ఉండాల్సింది అని స్వయంగా రాజమౌళి వీరాభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు.