లైంగిక దాడిపై లైవ్ లో స్పందించిన భావన

Actress Bhavana speaks about sexual assault after 5 years
Actress Bhavana speaks about sexual assault after 5 years

Actress Bhavana speaks about sexual assault after 5 years | ఐదేళ్ల క్రితం హీరోయిన్ భావన పై జరిగిన లైంగిక దాడి ఎంత సంచలనమైందో అందరికి తెలిసిందే. ఒంటరిగా వస్తోన్న నటి భావనని కిడ్నాప్ చేసి కొంత మంది అత్యాచారం చేసారు. ఈ లైంగిక దాడి వెనుక మలయాళ హీరో దిలీప్ సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కుని, కొంతకాలం జైలుకెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. సౌత్ మీడియా కూడా అప్పట్లో భావన పేరు హైలైట్ చేయకుండా ఓ ప్రముఖ హీరోయిన్ అని మాత్రమే వార్తలను ప్రచురించింది. కట్ చేస్తే ….

టాలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ లలో బాగా పాపులర్ హీరోయిన్ అయిన భావన కూడా ఐదేళ్లనుంచి పెద్దగా ఈ విషయంపై స్పందించింది లేదు. ఈమధ్యే కేరళ ముఖ్యమంత్రికి ఈ కేసు విషయమై బహిరంగ లేఖ రాసింది భావన. తాజాగా ఓ జాతీయ టీవీ ఛానల్ లైవ్ షోలో ఈ లైంగిక దాడిపై స్పందించిన భావన, చాలామంది అప్పట్లో అండగా నిలబడ్డారని, అలాగే ఆ సమయంలో బయటికి ఎందుకు వెళ్ళింది అని తనపైనే నిందలు కూడా వేశారని అంటోంది. బాధితురాలే స్వయంగా పోరాటానికి సై అంటుంది కనుక, ఇకనైనా అసలు నిందితులకు శిక్షలు పడతాయేమో చూడాలి.

Actress Bhavana speaks about sexual assault after 5 years