Pooja hegde kollywood | మూగమూడి అనే తమిళ సినిమాతోనే తెరంగేట్రం చేసిన కన్నడ భామ పూజా హెగ్డే టాలీవుడ్, బాలీవుడ్ అన్ని చోట్లా మొదట్లో ఐరన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది. ఆ తరువాత అమ్మడి అదృష్టం బాగుండి తెలుగు ప్రేక్షకులు ఆమెను స్టార్ హీరోయిన్ చేసారు. ముంబై భామలు ఎక్కువమంది సౌత్ లో పాపులర్ అయ్యాక బాలీవుడ్ అవకాశం రాగానే సౌత్ పై విషం చిమ్ముతారు. అటువంటి వారు చాలామంది అటుఇటు కాకుండా పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పూజాహెగ్డే కూడా దాదాపు ఇలాంటి పనే చేసింది. వివరాల్లోకి వెళితే….
పూజా హెగ్డే ఇప్పుడు విజయ్ సరసన బీస్ట్ సినిమాలో నటించింది. అలాగే పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కూడా తమిళంలో విడుదలవుతుంది. దీంతో అమ్మడు తమిళ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసింది. తనకు లైఫ్ ఇచ్చింది కోలీవుడ్ అని, ఇక ముందు తమిళంలో సొంత డబ్బింగ్ చెప్పుకునే ప్రయత్నం చేస్తానని, తనను స్టార్ ని చేసింది తమిళ ఇండస్ట్రీ అని తెగ సొల్లు చెప్పింది. ఇలాంటి వాళ్ళు అక్కడ ఆ మాట, ఇక్కడకొచ్చి తెలుగు ఇండస్ట్రీ లైఫ్ ఇచ్చింది అని చెపుతూ ఉంటారు. పాపం వినేవాళ్లే….
Pooja hegde kollywood