Mythri movie makers | టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రామిసింగ్ బడా ప్రొడక్షన్ కంపనీ అంటే మైత్రీ మూవీమేకర్స్ అని చెప్పవచ్చు. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాతో ప్రస్థానాన్ని ప్రారంభించిన మైత్రీ మూవీమేకర్స్ ఆతరువాత ఎన్నో భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. పుష్ప తో భారీ హాట్ కొట్టి, రెండో పార్ట్ మొదలు పెట్టబోతున్న మైత్రీ మూవీమేకర్స్ బాలయ్యతో 107 , మహేష్ బాబు తో ‘సర్కారు వారి పాట’, చిరంజీవి తో ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్ లో తమకు ఎదురే లేదని నిరూపించుకున్నారు.
అలాంటి మైత్రీ మూవీమేకర్స్ వారు ఓ డిజాస్టర్ హీరోతో 9 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీయనున్నారని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం అనే ఓ హీరో ఈమధ్యే ‘సెబాస్టియన్’ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాలో అస్సలు విషయం లేకపోవటంతో భారీ డిజాస్టర్ అయింది. ఆ సినిమాకొన్న డిస్ట్రిబ్యూటర్లకు అతి కష్టం మీద 20 శాతం వరకు రికవరీ అయ్యిందని ట్రేడ్ సమాచారం. అది కూడా కొంతమందికే. ఇంకొన్ని చోట్ల పది శాతం కూడా రాలేదంటున్నారు. ఈ ఎఫెక్ట్ సదరు హీరో తదుపరి చిత్రాలపై ఖచ్చితంగా పడుతుంది. ఇలాంటి సమయంలో ఆ హీరో తో మైత్రి వారి సినిమా అంటే ఆలోచించాల్సిన విషయమే. వారి మదిలో ఏముందో?